హోలీ వేడుక భిన్నంగా వుండాలని కదులుతున్న ద్విచక్రవాహనంపై టీనేజర్స్ వెర్రిచేష్టలు
ఈమధ్య కాలంలో కొంతమంది టీనేజ్ యువతీయువకులు చేసే పని విభిన్నంగా వుండాలని వెర్రిచేష్టలు చేస్తున్నారు. ఈ పనుల వల్ల కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చుకుంటుంటే మరికొందరు ప్రాణాలనే కోల్పోతున్నారు. ప్రమాదకరమైన పని అని తెలిసినా అలాంటివి చేస్తూనే వున్నారు.
హోలీ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటోంది. ఐతే ఓ టీనేజ్ జంట దీన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోలనుకున్నారు. ద్విచక్రవాహనాన్ని యువకుడు నడుపుతుండగా ఓ యువతి వెనుక సీటుపై నిలబడి అతడి బుగ్గలకు రంగులు పూస్తూ వుంది. అలా పూయడం అయ్యాక టైటానిక్ హీరోయిన్ మాదిరిగా రెండు చేతులు చాపి కదులుతూ వెళ్తున్న వాహనంపై నిలబడింది.
అంతే.. కొద్దిదూరం వెళ్లగానే వాహనం పైనుంచి కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో బ్రతికిబయటపడింది. ఈ ఘటన నోయిడాలో జరిగినట్లు తెలుస్తుంది.