శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 జనవరి 2020 (18:03 IST)

ప్రియుడే కదా అని బట్టలిప్పి నిలబడిన ప్రియురాలు.. ఆ తరువాత?

ప్రియుడిని నమ్మింది ఆ ప్రియురాలు. గాఢంగా ప్రేమించింది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటుందో అతనూ అలాగే ఉంటాడని భావించింది. అలా నమ్మిన ప్రియుడితో ఒకరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతూ అతని కోరిక మేరకు వీడియో కాల్‌లో తన బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా నిలబడింది. దీంతో ఆ ప్రియుడు తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. 
 
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా పల్లపట్టి రాజన్ వీధికి చెందిన రాజశివసుందర్ బిటెక్ చదివి చెన్నై, తిరుముల్వాయల్, ఆవడి, మైలాపూర్ ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్స్‌ను నడుపుతున్నాడు. కొద్దిరోజుల క్రితం సెల్ ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా చెన్నైలోని వాషర్‌మెన్ పేట శ్రీనివాసపురానికి చెందిన 16 యేళ్ళ బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఆ యువకుడి కన్నా యువతే అతన్ని గాఢంగా ప్రేమించింది.
 
వారం రోజుల క్రితం వీడియో కాల్ చేసి మాట్లాడుతూ నగ్నంగా ఒక్కసారి కనిపించవా అంటూ రిక్వెస్ట్ చేశాడు ప్రియురాలిని. అతడి రిక్వెస్ట్ పైన ఏ మాత్రం ఆలోచించని ఆ యువతి తన బట్టలు మొత్తాన్ని విప్పేసింది. ప్రియుడి కోసం రెండు నిమిషాలు అలాగే నగ్నంగా నిలబడింది. దీంతో ఆ వీడియోను రికార్డ్ చేశాడు ఆ యువకుడు. మూడు రోజుల క్రితం ఆ వీడియోను చూపించి తన కోరిక తీర్చమన్నాడు. దీనికి ఆమె ససేమిరా అంది. పెళ్ళి తరువాతనే అన్నీ అని చెప్పింది. దీంతో బెదిరింపులకు దిగాడు. 
 
5 లక్షల రూపాయలు ఇస్తే వీడియో డిలీట్ చేస్తానని.. లేకుంటే ఇంటర్నెట్లో పెట్టేస్తానని చెదిరించాడు. దీంతో ఆ యువతి తల్లికి జరిగిందంతా చెప్పింది. పోలీసుల సహకారంతో ఒక కానిస్టేబుల్, బాధిత యువతి మామలా మాట్లాడి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ యువకుడిని పిలిపించారు. ఆ తర్వాత తమదైన శైలిలో అతడిని అదుపులోకి తీసుకుని యువతి వీడియోను డిలీట్ చేశారు.