సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (14:32 IST)

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన దివ్యాంగుడి ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి తన సోదరీమణులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని పళని అడివారం అరుల్‌జ్యోతి వీధిలో క‌ల‌క‌లం రేపింది. దివ్యాంగుడయిన వేలుసామి (32) చిల్లర దుకాణం నడుపుత

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి తన సోదరీమణులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని పళని అడివారం అరుల్‌జ్యోతి వీధిలో క‌ల‌క‌లం రేపింది.

దివ్యాంగుడయిన వేలుసామి (32) చిల్లర దుకాణం నడుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. వేలుసామికి నలుగురు సోదరీమణులున్నారు. అందులో జయలక్ష్మి అనే సోద‌రికి ఇప్ప‌టికే వివాహం కాగా, ఆమె భర్తతో విడిపోయి వేలుస్వామి వ‌ద్దే ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో వేలుసామి ఇంటి నిర్మాణానికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఈ అప్పుల ఒత్తిడి తాళలేక వేలుసామి త‌న‌ సోదరీమణులు చంద్ర, జయలక్ష్మితో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని పళని మురుగన్ ఆలయానికి వ‌చ్చాడు. 
 
వారు ముగ్గురు అక్క‌డే విషం తీసుకోవ‌డంతో స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.