శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 జులై 2017 (15:31 IST)

బీజేపీ క్లాస్: ఓపీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి: ఏకం కానున్న పళని-ఓపీఎస్ వర్గాలు..?

తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కారులో మంత్రివర్గ మార్పుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మంత్రవర్గ మార్పు జరిగితే విడిపోయిన వర్గాలన్నీ ఏకకమవుతాయని రాజకీయ వర్గాల్లో టాక్. ఓపీఎస్ వర్గం, ఎడప్పాడి పళనిసామి వర్గం

తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కారులో మంత్రివర్గ మార్పుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మంత్రవర్గ మార్పు జరిగితే విడిపోయిన వర్గాలన్నీ ఏకకమవుతాయని రాజకీయ వర్గాల్లో టాక్. ఓపీఎస్ వర్గం, ఎడప్పాడి పళనిసామి వర్గం మంత్రివర్గ మార్పు ద్వారా ఏకమవుతారని తెలిసింది. కొన్నిరోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిసామి కూడా ఢిల్లీకి వెళ్లారు.
 
వీరిద్దరితో హస్తిన పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై బీజేపీకి చెందిన ఓ నేత చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పళనికి, ఓపీఎస్‌లు ఏకం కావాలని బీజేపీ నేత సూచించినట్లు సమాచారం. విడివిడిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా సొంతం చేసుకోలేరని హితవు పలికినట్లు టాక్. అన్నీ వర్గాలు ఏకం కండి.. ఆపై బీజేపీకి మద్దతిచ్చి ఎన్నికల్లోకి పోతే.. మేలు జరుగుతుందని సదరు నేత ఓపీఎస్- పళనికి సూచించినట్లు వినికిడి. 
 
ఈ సందర్భంగా ఓపీఎస్ మంత్రిగా కొనసాగడం కుదరదని.. ఆయన వర్గీయులు అందుకు ఒప్పుకోరని పళని చెప్పగా, పన్నీరుకు ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి, ఆయన వర్గీయులకు మంత్రి పదవులిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 
 
ఎడప్పాడి కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏకమైతేనే పార్టీకి మేలు జరుగుతుందని.. అలా జరగని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని బీజేపీ అటు పన్నీరు ఇటు పళనికి హితవు పలికినట్లు తెలుస్తోంది. దీంతో పన్నీరుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని సమాచారం.