ముస్లిం బోర్డు ధోరణి వివక్షాపూరితం : ముస్లిం మహిళల అభ్యంతరం
ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై
ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకుల కోసం మూడుసార్లు తలాక్ చెప్పే విధానం, బహుభార్యత్వంపై న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రశ్నావళిని బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
దీనిపై ముస్లిం మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు నజ్నీన్ అన్సారీ లక్నోలో మాట్లాడుతూ ముస్లిం లా బోర్డు షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మెలితిప్పుతోందని ఆరోపించారు. ముస్లిం మహిళల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల గురించి చర్చ జరుగుతున్నపుడు మాత్రమే షరియా చట్టాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. అత్యాచారం, తదితర కేసుల్లో నేరస్థులైన ముస్లిం పురుషుల విషయంలో షరియా చట్టం అమలు చేయాలని మత పెద్దలు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ఆమె నిలదీశారు.