శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (15:55 IST)

''క్రైం పెట్రోల్'' యాక్టర్ రాహుల్ చేలానీ అడ్డంగా బుక్కయ్యాడు.. రూ.43 లక్షలు స్వాధీనం..

క్రైం పెట్రోల్‌ అనే షోలో నటిస్తున్న నటుడు రాహుల్ చేలానీ అడ్డంగా బుక్కయ్యాడు. మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ నుంచి హోషంగాబాద్‌కు కారులో వెళ్తున్న ఇతగాడిని మధ్యలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని కారులో రూ.43 లక

క్రైం పెట్రోల్‌ అనే షోలో నటిస్తున్న నటుడు రాహుల్ చేలానీ అడ్డంగా బుక్కయ్యాడు. మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ నుంచి హోషంగాబాద్‌కు కారులో వెళ్తున్న ఇతగాడిని మధ్యలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని కారులో రూ.43 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కొత్త 500, 2వేల నోట్లు కనుగొని షాక్ అయ్యారు. తనను యాంటీ కరప్షన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా రాహుల్ చేలానీ చెప్పుకున్నాడు. 
 
అయితే అలాంటి సంస్థ ఉన్నట్టు ఏదీ పోలీసులు వినలేదు. కారు వెనక ఆ బోర్డు కూడా ఉన్నా వాళ్ళు నమ్మక ఆ సొమ్ము గురించి గుచ్చి అతడిని ప్రశ్నించారు. అదే కారులో చేలానీ బంధువు కపిల్ చేలానీ కూడా ఉన్నాడట. ఈ డబ్బుల గురించి అడిగితే ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పారు. తన మరో 'క్రైం షో' కోసం నిర్వాహకులు తనకిచ్చిన సొమ్ము ఇదని అతగాడు చెబితే.. కపిల్ మరో రకంగా దాని గురించి చెప్పి పోలీసులను ఖంగు తినిపించాడు. 
 
పైగా పోలీసులను చూడగానే రాహుల్ చేలానీ తన డ్రైవర్ బ్రిజేష్ చౌరాను పారిపొమ్మని చెప్పాడని.. కానీ పోలీసులముందు వీళ్ళ ఆటలు సాగలేదని తెలిసింది. వాళ్ళు ఆ 43 లక్షలను స్వాధీనం చేసుకుని ఐటీ శాఖకు అప్పగించారు.