గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (16:52 IST)

బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. అసలేం జరిగింది?

Udyan Express
Udyan Express
బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఇటీవల ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎలా మంటలు వ్యాపించాయనే అంశంపైడ అధికారులు విచారణ జరుపుతున్నారు. 
 
ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన వెంటనే రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేఎస్సార్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.