శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:14 IST)

తనయుడికి తండ్రి షాక్... ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు

తనయుడికి తండ్రి షాకిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తొలగించారు. ఈ చర్య ఆ పార్టీ రాజకీయాల్లో సంచలనం రేపింది.

తనయుడికి తండ్రి షాకిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తొలగించారు. ఈ చర్య ఆ పార్టీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగున్నాయి. ఇంతలోనే ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం అఖిలేష్ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ములాయం యూపీ సమాజ్‌వాదీ అధ్యక్ష పదవి నుంచి సొంత కొడుకును తప్పించారు. ఆ స్థానంలో సోదరుడు శివపాల్ యాదవ్‌‌ను నియమిస్తున్నట్టు ప్రకటించి, పార్టీకి అసలు బాస్‌ను తానేనని మరోసారి నిరూపించుకున్నారు. 
 
అఖిలేష్ మంత్రివర్గం నుంచి తప్పించిన మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్ కిశోర్ సింగ్‌లు ములాయంకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. అవినీతికి పాల్పడితే, ఎంతటి వారైనా సహించేది లేదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఆయనపైనే వేటు పడటం యూపీలో రాజకీయ వేడిని పెంచింది.