ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:01 IST)

డింపుల్ దెబ్బకు అఖిలేష్ చాలడంలేదా...? భాజపా, బీఎస్పీ నాకౌట్..?

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆఖరి దశకు వచ్చేశాయి. ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయోగానీ అఖిలేష్ యాదవ్ శ్రీమతి డింపుల్ యాదవ్ మాత్రం ప్రత్యర్థులను తన మాటలతో చీల్చి చెండాడుతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడి వస్తున్నారు. చెప్పాలంటే అఖిలేష్

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆఖరి దశకు వచ్చేశాయి. ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయోగానీ అఖిలేష్ యాదవ్ శ్రీమతి డింపుల్ యాదవ్ మాత్రం ప్రత్యర్థులను తన మాటలతో చీల్చి చెండాడుతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడి వస్తున్నారు. చెప్పాలంటే అఖిలేష్ యాదవ్ ప్రచారం కూడా డింపుల్ దెబ్బకు కుదేలవుతుందా అనే దశకు వెళ్లిపోయిందంటున్నారు. 
 
తన ప్రచారంలో భాజపా, బీఎస్పీ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ చక్కటి పాటలు కూడా పాడుతున్నారు. ఆమె మాటలకు, పాటలకు వచ్చిన జనం మంత్రముగ్ధులవుతున్నారు. తమ నియోజకవర్గాల్లో డింపుల్ చేత ప్రసంగాలు చేయించుకోవాలని అభ్యర్థులు పోటీపడుతున్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. మొత్తమ్మీద చూస్తే భాజపా, బీఎస్పీ ఆశలను పూర్తిగా కొల్లగట్టి గల్లంతు చేయడంలో డింపుల్ కీలకపాత్ర పోషిస్తుందని జనం చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద సినీ గ్లామర్ మించిపోయిన పొలిటికల్ గ్లామర్‌తో ముందుకెళ్తోంది డింపుల్.