ఎస్పీతో ఎవరు చేతులు కలిపినా లబ్ధి చేకూర్చినట్టే : మాయావతి
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో ఎవరు చేతులు కలిపినా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చినట్టేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. గతంలో ఏర్పడి ఆపై ముక్కల
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో ఎవరు చేతులు కలిపినా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చినట్టేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. గతంలో ఏర్పడి ఆపై ముక్కలైపోయిన 'జనతా పరివార్' నేతలను సమాజ్ వాదీ పార్టీ ఒక చోటకు చేర్చడంపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమో మాయావతి తనదైనశైలిలో స్పందించారు. సమాజ్ వాదీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా, అది బీజేపీకి మాత్రమే లాభం చేకూర్చి పెడుతుందన్నారు. అసలు సమాజ్‌వాదీతో పొత్తుకు సిద్ధపడుతున్న రాజకీయ పార్టీలు, అందుకు కనీసం ఒక్క మంచి కారణాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్పీ నడిరోడ్డుపై ఒంటరిగా నిలిచిందని, బీజేపీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని, ఆ పార్టీకి లబ్ధిని చేకూర్చేలా చూసేందుకు చూస్తోందని ఆరోపించారు. యూపీలో ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం లేని పార్టీలవైపు మాత్రమే సమాజ్ వాదీ చూస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో సమాజ్ వాదీకి మద్దతివ్వడం అంటే, బీజేపీకి మద్దతిస్తున్నట్టేనని, రాష్ట్రంలో దళిత, బడుగు, ముస్లిం వ్యతిరేక ప్రభుత్వాన్ని ఆహ్వానించినట్లవుతుందని మాయావతి వ్యాఖ్యానించారు.