శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (15:31 IST)

యూపీలో రెచ్చిపోయిన ఈవ్‌టీజర్లు.. ఇద్దరు మహిళలను వేధించిన పోకిరీలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న తల్లీ, కూతుళ్లను వేధించారు. చేయిపట్టుకుని లాగారు. నెట్టారు. ‘మా దారిన మేం పోతున్నాం, వదిలేయండి మహాప్రభో’ అని వేడుకున్న

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న తల్లీ, కూతుళ్లను వేధించారు. చేయిపట్టుకుని లాగారు. నెట్టారు. ‘మా దారిన మేం పోతున్నాం, వదిలేయండి మహాప్రభో’ అని వేడుకున్నా విడిచిపెట్టలేదు. చివరకు ఈ సమాచారం పోలీసులకు క్షణాల్లో చేరడంతో ఈవ్ టీజర్లు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాంపూర్‌లో తల్లీకూతుళ్లు రోడ్డున నడిచి వెళుతున్నారు. ఆ సమయంలో 14 మంది యువకులు వారిని చుట్టిముట్టి వేధించసాగారు. వారిలోనే కొందరు అదో ఘనకార్యమైనట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఏ మాత్రం భయం లేకుండా అమ్మాయిల వెంట పడిన వారిలో పట్టుమని పదేళ్లు కూడా నిండని వారు కూడా ఉన్నారు. 
 
వీరిలో ఒకడైతే, ఏకంగా అమ్మాయిని ఎత్తుకుని పరిగెత్తబోయాడు. తమను విడిచి పెట్టాలని వారు బతిమాలుకున్నా వినలేదు. నవ్వుతూ, వారిపై చెత్త జోకులేస్తూ తాకరాని చోట తాకుతూ పైశాచికానందాన్ని పొందారు. రాంపూర్‌లోని ఓ పార్కులో జరిగిన ఘటన వీడియో వైరల్ కాగా, స్పందించిన పోలీసులు పోకిరీలను పట్టుకుని జైల్లో పెట్టారు. తమదైన పద్ధతిలో ఈవ్ టీజర్లకు దేహశుద్ది చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.