శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (15:31 IST)

బాలుడిని హత్య చేసి.. కాళ్లు - చేతులు ముక్కలు చేసి ఆరగించిన నరమాంస భక్షకుడు (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నజీం మియ్యా అనే 20 యేళ్ళ యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి భక్షించాడు. ఇది చూసి అతడి తల్లి నిర్ఘాంతపోయి.. స్థానిక పోలీసులకు సమాచ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నజీం మియ్యా అనే 20 యేళ్ళ యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి భక్షించాడు. ఇది చూసి అతడి తల్లి నిర్ఘాంతపోయి.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసి పచ్చి మాంసాన్ని ఆరగించసాగాడు. 
 
ఈ విషయాన్ని నజీం తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు... ఇంట్లోకి ప్రవేశించి రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహాన్ని గుర్తించారు. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు. హత్యకు గురైన బాలుడి వివరాలను సేకరిస్తున్నారు.