మంగళవారం, 24 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 మే 2016 (13:42 IST)

ఉత్తరాఖండ్ వేదికగా అరుదైన ఘటన.. రాష్ట్రపతి పాలన 2 గంటల పాటు రద్దు!

ఉత్తరాఖండ్ వేదికగా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మంగళవారం శాసన సభలో బలపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో రెండు గంటలపాటు దీన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్రపతి పాలనను రద్దు చేయడం ద్వారా.. బల పరీక్ష జరగడం ద్వారా సమావేశాల్ని నిర్వహించేందుకు వీలుండదు. రాష్ట్రపతి పాలనను రద్దు చేసి ఆపై నిర్వహిస్తున్న ఈ బలపరీక్ష వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. బలపరీక్ష ముగిసినందున ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. శాసనసభలో జరిగిన బలపరీక్ష తీర్పును బుధవారం వెల్లడించనుంది.