శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

వందే భారత్‌ రైలులో మంటలు... వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

vande bharat train fire
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లుగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దున్నపోతును ఢీకొనడంతో ఈ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరోమారు భారీ వర్షానికి వందే భారత్ రైలు లోపలి భాగం తడిసి ముద్దయింది. తాజాగా వందే భారత్ రైలింజిన్ ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన లోకే పైలెట్లు తక్షణం రైలును నిలిపివేసి మంటలను అదుపు చేడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ రేలు ఢిల్లీ వెళుతుండగా రాణి కమలాపతి (భోపాల్) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలెట్లు కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చొన్నారు. రైలు ఇంజిన్‌లోని బ్యాటరీలు తగలబడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని, ఈ బ్యాటరీలను తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లిందని రైల్వే శాఖ తెలిపింది.