బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (19:22 IST)

ప్రపంచంలో బిజెపిని మించిన పార్టీ లేదు - కేంద్రమంత్రి వెంకయ్య

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బిజెపి చరిత్ర తిరగరాస్తోందన్నారు కేంద్ర సమాచార శాఖామంత్రి వెంకయ్యనాయుడు. బిజెపికి ఏ పార్టీ పోటీ కాదని, ప్రజలు బిజెపికి పట్టం కడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని వి

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బిజెపి చరిత్ర తిరగరాస్తోందన్నారు కేంద్ర సమాచార శాఖామంత్రి వెంకయ్యనాయుడు. బిజెపికి ఏ పార్టీ పోటీ కాదని, ప్రజలు బిజెపికి పట్టం కడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని ప్రజలే తిప్పికొడుతూ బిజెపి వైపే మొగ్గు చూపుతుండటం సంతోషించదగ్గ విషయమన్నారాయన. 
 
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందారని, ఏఫ్రిల్ 6వ తేదీన జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో అందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల వైపు త్వరలో దృష్టి సారిస్తామన్నారు కేంద్రమంత్రి వెంకయ్య. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్రమంత్రి వెంకయ్యకు ఘనస్వాగతం లభించింది.