జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారు.. వదంతులు నమ్మొద్దు : వెంకయ్య నాయుడు
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారనీ, ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారనీ, ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన ఆదివారం పరామర్శించారు. ఆ తర్వాత జయ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జయ కోలుకుంటారన్న నమ్మకం తనకుందని చెప్పారు.
ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. జయలలిత దృఢమైన నాయకురాలని, అలాంటి వ్యక్తి గురించి ఎవ్వరైనా ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యంగా వదంతులను పార్టీ శ్రేణులుగానీ, ప్రజలుగానీ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.