సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (10:19 IST)

హత్య కాదు.. ఆత్మహత్యే... నదిలో తోశారో లేదో పోలీసులు నిర్ధారిస్తారు?

కేఫ్ కాఫీ డే అధినేత వీజే సిద్ధార్థతి ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అయితే, తుది నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు మంగుళూరు సౌత్ డీసీపీ వెల్లడించారు. ఇటీవల కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజే సిద్ధార్థ ఇటీవల నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈయన పోస్టుమార్టం తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. ఈ మేరకు వెన్‌లాక్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. 
 
అదృశ్యమైన రోజునే సిద్ధార్థ నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పటి వరకు చేసిన పరీక్షల ద్వారా స్పష్టమైనట్టు పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నదిలో దూకారా? లేక, ఎవరైనా బలవంతంగా ఆయనను నదిలో తోశారా? అన్న విషయం మాత్రం పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. 
 
పైగా, సిద్ధార్థ ఊపిరితిత్తుల్లోకి నీరు బాగా చేరిందని రాజేశ్వరి తెలిపారు. గంటల తరబడి నీటిలో నాని తర్వాత ఊపిరి తిత్తులు ఎలా ఉబ్బిపోతాయో.. అలానే ఉన్నాయని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆయన నీటిలో మునగడం వల్లే చనిపోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు.