గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (17:25 IST)

కాబోయే భర్తకు స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది.. నిశ్చితార్థం అయిన 15 రోజుల్లో..?

కాబోయే భర్తతో అన్నీ పంచుకోవాలనుకుంది. ఎంగేజ్‌మెంట్ అయింది కదా అని అడ్వాన్స్ అయింది. స్నానం చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. పొరపాటున ఏది నొక్కబోయి ఏది నొక్కిందో అది కాబోయే భర్తకు కాకుండా స్నేహితుడు అని భావించిన ఓ వ్యక్తికి చేరింది. తాను చూడడమే కాకుండా మరికొంత మందికి షేర్ చేసి ఆనందం పొందాడు.
 
ఆ విషయం యువతి తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులకు తెలిసింది. పరువు పోయిందని భావించిన యువతి మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ తారానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తోబ్రిఖేడా గ్రామానికి చెందిన ఒక యువతి తన కాబోయే భర్తకు స్నానం చేస్తున్న వీడియోను పంపాలని అనుకుంది. అయితే పొరపాటున అది తన స్నేహితుడికి వెళ్లింది. స్నేహితుడు వీడియోను వైరల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
 
ఆ యువతికి 15 రోజుల క్రితమే ఇండోర్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు మొదట ఆమెను తరణా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ లాభం లేదని వైద్యులు చెప్పడంతో తరువాత జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్ప పొందుతూ ఆమె మరణించింది.