నేను తాగుబోతును.. ఢిల్లీ వీధుల్లో మహిళ వీరంగం.. పోలీసులు రెండు దెబ్బలేసి..?
నేను తాగుబోతును.. ఇలానే తప్పతాగి తిరుగుతాను.. అంటూ ఢిల్లీ వీధుల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూటుగా మద్యం సేవించిన ఓ ఢిల్లీ యువ
నేను తాగుబోతును.. ఇలానే తప్పతాగి తిరుగుతాను.. అంటూ ఢిల్లీ వీధుల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూటుగా మద్యం సేవించిన ఓ ఢిల్లీ యువతి వీరంగం చేసిన వీడియో వైరల్ అయ్యింది. బాగా మందు కొట్టి ఢిల్లీ వీధుల వెంట పడిన ఆ యువతిని పోలీసులు అడ్డుకున్నారు. నువ్వు ఎవరివని ప్రశ్నించారు. అందుకు ఆమె బహిరంగంగానే తాగుబోతునని చెప్పింది.
అంతేకాదు... పోలీసుల వద్దే పొగరుగా సమాధానమిచ్చింది. ఈమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు మహిళా పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చాలాసేపటి తరువాత ఆమెను రిక్షాలో కూర్చోబెట్టి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిక్షాలోనూ అమ్మడు కుదురుగా కూర్చోలేదు. స్టేషన్ లోపలికి తాను రానని.. తానేమీ తప్పు చేయలేదని హంగామా చేసింది. పోలీసులపైనే చేజేసుకోబోయింది. ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆమెపై చేజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు చెంప దెబ్బలేసి.. ఆమెను మహిళా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.