ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (10:26 IST)

ఢిల్లీకి హుటాహుటిన కిరణ్ బేడీ.. వాట్సాప్ అశ్లీల దృశ్యాల వివాదమే కారణమా?

పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీకి 30కి పైగా అశ్లీల వీడియోలు, మెసేజ్‌లను పంపిన శివకుమార్ అనే ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. కిరణ్ బేడీ ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల

పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీకి 30కి పైగా అశ్లీల వీడియోలు, మెసేజ్‌లను పంపిన శివకుమార్ అనే ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. కిరణ్ బేడీ ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, అన్ని శాఖల అధికారులనూ గ్రూప్ సభ్యులుగా చేర్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై సత్వర ఆదేశాలు ఈ గ్రూప్ ద్వారానే ఆమె జారీ చేస్తుంటారు.
 
ఈ గ్రూప్‌కు మూడు ఫోల్డర్లలో వీడియో వచ్చింది. దీన్ని చూసిన కిరణ్ బేడీ సహా అధికారులు అవాక్కయ్యారు. అసభ్య మెసేజ్‌లు, వీడియోలు ఇందులో ఉన్నాయి. ఆ వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ ప్రీతాను కిరణ్ బేడీ ఆదేశించారు. సీనియర్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన్ను విధుల నుంచి తొలగించారు. 
 
ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో గవర్నర్‌ కిరణ్‌బేడీకి, రాష్ట్ర మంత్రివర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆమె ఆకస్మికంగా ఢిల్లీకి పయనమయ్యారు. పాలకులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేస్తారేమోనని పుకార్లు వ్యాపిస్తున్నాయి. కిరణ్‌బేడీకి ఇటీవల సహాకార సంఘాల రిజిస్ట్రా‌ర్‌ శివకుమార్‌ అశ్లీల దృశ్యాలున్న వాట్సాప్‌ మెసేజ్‌ పంపి సస్పెండయ్యారు. 
 
శివకుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ పట్టుబడుతున్నట్టు తెలియడంతో సహకార సంఘాల అధికారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఈ విషయమై మాట్లాడుతూ... ప్రభుత్వ పాలన వ్యవహారాలను వాట్సప్‌ గ్రూపుల ద్వారా నిర్వహించడం సబబు కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా గవర్నర్‌ కిరణ్‌బేడీ ప్రభుత్వ అధికారుల సమాచార పరివర్తనలకు నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రూపును వ్యతిరేకించడమే అవుతుందన్నారు. 
 
ఇక గవర్నర్‌ కిరణ్‌ బేడీ సెలవు దినాలలో ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకుని స్వచ్చభారత కార్యక్రమాలను నిర్వహిస్తుండటాన్ని కూడా పాలకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కిరణ్‌బేడీ ఆకస్మికంగా ఢిల్లీకి పయనం కావడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.