1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (17:49 IST)

రూ.2000 నోట్లతో నల్లధనం మరింత పెరుగుతుందన్న పీసీ: చిల్లర నిల్.. టోల్ ట్యాక్స్ రద్దు

రూ.500, 1000 నోట్ల రద్దుపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఢిల్లీలో మీడియా సమక్షంలో స్పందించారు. నోట్ల రద్దుతో ఒరిగేదేమీలేదని.. లాభం కంటే నష్టమే అధికమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఇబ్బందు

రూ.500, 1000 నోట్ల రద్దుపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఢిల్లీలో మీడియా సమక్షంలో స్పందించారు. నోట్ల రద్దుతో ఒరిగేదేమీలేదని.. లాభం కంటే నష్టమే అధికమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 1978లో ఇలాంటి నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందని పీసీ గుర్తు చేశారు. రూ.2000 నోట్ల వల్ల నల్లధనం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 
 
నల్లధనం నిరోధానికే నోట్లు రద్దు చేస్తే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నోట్ల రద్దు కారణంగా రోజువారీ వేతనాలు తీసుకునే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారని చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, బ్యాంకులకు నోట్ల రద్దు అనేది పరీక్ష లాంటిదన్నారు.
 
ఇదిలా ఉంటే.. రూ.500, 1000 నోట్ల రద్దు చేయడంతో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టోల్‌ రుసుము చెల్లించేందుకు చిల్లర లేక వాహనదారులు టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. నవంబర్ 11 అర్థరాత్రి వరకు జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.