శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (08:53 IST)

మేనకోడలిని కిడ్నాప్ చేసి... కళ్లుపీకి... బ్లేడుతో కోసి.. అత్త కిరాతక చర్య

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగుల

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు నగరం సమీపంలోని సాథాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే ఓ మహిళ పాఠశాలకు వచ్చి తన మేనకోడలిని మారుమూల నిర్జన ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ బాలిక శరీరం అంతా బ్లేడుతో గాయపర్చింది. ఆపై ఆమె కళ్లలోకి పిన్నులు గుచ్చి కళ్లు పీకేసింది. ఈ దారుణ ఘటనతో రక్తసిక్తమైన బాలిక స్పృహ కోల్పోయింది. కొందరు ఆటోడ్రైవర్లు, పాదచారులు ఈ ఘటన చూసి బాలికను పిల్లల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడటానికి కారణాలు తెలియరాలేదు.