శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (11:44 IST)

తమిళనాడులో దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో ఓ భార్య, భర్త మీద పెట్రోల్ పోసి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, మడిపాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మడిపాక్కం తందై పెరియార్ నగర్‌కు చెందిన పాండి, పార్వతి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. 
 
గురువారం సాయంత్రం వీరి మధ్య మరోసారి జరిగింది. ఉన్నట్టుండి పాండీ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడ చేరుకున్నారు. పాండీ శరీరంపై వున్న మంటలను ఆర్పారు. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
పోలీసుల విచారణలో కుటుంబ తగాదాల కారణంగా భార్య తనపై  పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పాండి వాంగ్మూలం ఇచ్చి మరణించాడు. దీంతో పాండి భార్య పార్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణను కొనసాగిస్తున్నారు.