శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (11:28 IST)

భర్త పోర్న్‌కు బానిసయ్యాడు.. సుప్రం కోర్టును ఆశ్రయించిన భార్య.. ఆ సైట్లపై నిషేధం విధించండి..

భర్త పోర్న్ వీడియోలు చూస్తున్నాడని.. ఆ భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తన భర్తపై కేసు వేయకుండా పోర్న్ సైట్లపై కేసు వేసింది. ఆ వీడియోల వల్ల తాను, తన కుటు

భర్త పోర్న్ వీడియోలు చూస్తున్నాడని.. ఆ భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తన భర్తపై కేసు వేయకుండా పోర్న్ సైట్లపై కేసు వేసింది. ఆ వీడియోల వల్ల తాను, తన కుటుంబం సమస్యల్లో చిక్కుకుందని వెంటనే వాటిని నిషేధించేలా తగుచర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులను కోరింది. ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేసింది. 
 
పిటిషన్‌లో ఇంటర్నెట్‌లో పోర్న్ వీడియోలు సులభంగా దొరకటం వల్ల రోజంతా వీడియోలు, ఫొటోలు చూస్తూ బానిసలా మారాడు. తన భర్తకు 50 దాటిందని.. తద్వారా తమ దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడుతోందని పేర్కొంది. ఇంతా పోర్న్‌కు వ్యసనపరుడు కావటంతో నేను, మా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పిల్లల్ని చూసుకోవాల్సిన వయసులో ఆ వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాడని తెలిపింది. 
 
వయస్సు మళ్లిన భర్త పరిస్థితే ఇలా ఉంటే యువత, పిల్లల పరిస్థితి ఏంటి?' అని ప్రశ్నించారు. జీవితాలను పాడు చేస్తున్న పోర్న్ సైట్లను వెంటనే నిషేధించాలని కోర్టుకు విన్నవించారు. కాగా, చైల్డ్ పోర్నోగ్రఫీని నిషేధించాలని, దానికోసం సాంకేతిక సిబ్బందితో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సైట్లను బ్లాక్ చేయాల్సిందేనని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.