శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (17:04 IST)

భర్త లేడని పేపర్లో ప్రకటన: పది మందిని పెళ్లాడింది.. కేరళలో కి''లేడీ'' అరెస్ట్

వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వడం.. ఒకరి తర్వాత ఒకరు.. అలా పది మందిని పెళ్లాడింది ఓ కేరళ లేడీ. కేరళలో తాను భర్తను కోల్పోయానని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అబద్ధాలు చెప్పి.. వివాహం చేసుకున్న రోజే నగద

వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వడం.. ఒకరి తర్వాత ఒకరు.. అలా పది మందిని పెళ్లాడింది ఓ కేరళ లేడీ. కేరళలో తాను భర్తను కోల్పోయానని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అబద్ధాలు చెప్పి.. వివాహం చేసుకున్న రోజే నగదు, ఆభరణాలతో జంప్ అయ్యే ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ వార్తా పత్రికలో భర్తను కోల్పోయిన మహిళను వివాహం చేసుకునేందుకు వరుడు కావాలనే ప్రకటనను చూసిన ఓ వ్యక్తి.. ఆ పేపర్లోని ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. 
 
ఫోనులో షాలిని అనే మహిళ మాట్లాడింది. ఆమె భర్తను కోల్పోయానని... సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని.. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నమ్మిన బాధిత వ్యక్తి.. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. స్నేహితులు, వరుడు తరపు బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. వధువు తరపు వారు ఎవ్వరూ హాజరు కాలేదు. అయితే వరుడు తరపున పెళ్ళికొచ్చిన ఓ స్నేహితుడు.. ఫోనులో మరో వ్యక్తికి కాల్ చేశాడు. 
 
అతడు ఆ వివాహానికి రావడంతో వధువుగా మారి పదో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన షాలిని బండారం బయటపడింది. ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తినే వరుడి స్నేహితుడు షాలిని పెళ్లికి రప్పించాడు. దీంతో షాలినిపై పోలీసులకు బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశారు. సీన్లోకి వచ్చిన పోలీసులు అప్పటికే ఆమెపై ఐదు కేసులున్నట్లు చెప్పారు. ఆమెను  అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు జరుపుతున్నారు.