శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:15 IST)

ఆస్పత్రిలో మహిళ అడ్మిట్.. స్కాన్‌ గదికి తీసుకెళ్లి రేప్.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్దోయ్ పట్టణానికి చెందిన 40 యేళ్ళ మహిళ ఒకరు మతిస్థిమితం కోల్పోయి స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు.. ఆమెను స్కాన్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. 
 
దీంతో కేకలు వేయడంతో సాటి రోగులు వెళ్లి ఆమెను కాపాడి.. కామాంధుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం లక్నో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.