ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (04:52 IST)

రెండున్నర కోట్లమంది రైతుల నెత్తిన పాలు పోసిన యోగి.. లక్ష రుణమాఫికి గ్రీన్ సిగ్నల్

ఉత్తర ప్రదేశ్ రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపిన తొలి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఉత్తరభారతదేశ చరిత్రలోనే తొలిసారిగా రెండున్నర కోట్ల మంది రైతులకు లక్షరూపాయల వరకు రుణమాఫీ చేసే మహత్తర నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్

ఉత్తర ప్రదేశ్ రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపిన తొలి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఉత్తరభారతదేశ చరిత్రలోనే తొలిసారిగా రెండున్నర కోట్ల మంది రైతులకు లక్షరూపాయల వరకు రుణమాఫీ చేసే మహత్తర నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన కేబినెట్ భేటీలో యోగి యూపీ రైతుల నెత్తిన పాలు పోసేశారు. యూపీ రైతులకు  ఇది ఎంత పెద్ద ఊరట అంటే యోగిని తమ జీవిత కాలంలో మరవలేనంత గొప్ప సహాయం చేశారు.
 
ఎన్నికల హామీలో భాగంగానే యోగి తొలి కేబినెట్ భేటీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. యూపీ రైతులు చేసిన రుణాల్లో లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు.  దాదాపు 2.5కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా లబ్ధి పొందనున్నారని తెలుస్తోంది. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు యోగి ప్రభుత్వం దాదాపు రూ.36వేల కోట్లను రైతుల రుణమాఫీ కోసం వెచ్చించనుంది.
 
రెండు తెలుగు రాష్ట్రాలు రుణమాఫీపై ఎన్నికల వాగ్దానాన్ని ఆచరణలో ఎంత అపహాస్యం చేశాయో చూస్తున్న వారికి ఉత్తర ప్రదేశ్ రుణమాఫీపై కూడా అదేరకం అనుమానాలు తలెత్తడం సహజం. కానీ ఇక్కడ వీరికి లేనిదీ, అక్కడ యోగికి ఉన్నదీ ఏమిటంటే మోదీ అండ. మోదీ భరోసా ఉంటే యోగి ఇంత పెద్ద రుణమాపీని సునాయాసంగా నెరవేరుస్తాడని భావిస్తున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో రుణమాఫీలు ప్రకటించి ఆర్థిక వ్యవస్థను గుల్ల చేయవద్దంటూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో యోగి ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీని ఎలా చేయనున్నారన్నది ఇప్పుడు పజిల్.