టీసీ లేకుండానే స్కూల్లో చేరవచ్చు.. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

school bag
ఎం| Last Updated: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:20 IST)
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీసీ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీని వెనకాల బలమైన కారణం ఉంది. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్లు... విద్యార్థులు, తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి.

దాంతో ఆ ఫీజులు చెల్లించలేక, తమ పిల్లల్ని వేరే ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ మాన్పిస్తామంటే... ఫీజు బకాయిలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కండీషన్ పెడుతున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.

లబోదిబో మంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తమిళనాడులో భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి, ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని నెలలుగా తాము పడుతున్న ఆవేదనకు ప్రభుత్వం సరైన పరిష్కారం చూపిందని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీసీ ఇవ్వకుండానే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పొందవచ్చు.

అడ్మిషన్లు ఆలస్యం కాకుండా... అన్ని స్కూళ్లలో హెడ్‌మాస్టర్లు రెడీగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆర్డరేసింది.దీనిపై మరింత చదవండి :