Festival Posters

చికెన్ చీజ్ శాండివిజ్ ఎలా చేయాలో చూద్దాం..

ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలకు మిరియాలపొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో రుబ్బుకుని.. పక్కనబెట్టుకోవాలి. తర్వాత పుదీనా తరుగూ, తగినంత ఉప్పు, చిల్లీసాస

Written By selvi
Updated: శనివారం, 4 ఆగస్టు 2018 (14:20 IST)
చికెన్, చేపలు తినేవారికి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. చికెన్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. అయినా కొలెస్ట్రాల్ లెవల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి చికెన్‌ను ఆయిల్ వేయకుండా వండి తినడం వల్ల గుండెకు కూడా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి చికెన్‌తో చీజ్‌ను కలిపి శాండివిజ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
బ్రెడ్‌ స్లైసులు - 14,
బోన్‌లెస్ చికెన్ - అర కేజీ
ఉల్లిపాయ-ఒకటి, 
పుదీనా తరుగు- చెంచా, 
చీజ్‌ స్లైసులు- ఆరు, 
చిల్లీసాస్‌ - రెండు చెంచాలు,
వెన్న - అరకప్పు, 
పచ్చిమిర్చి- రెండు, 
ఉప్పు- రుచికి సరిపడా, 
మిరియాలపొడి - చెంచా. 
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలకు మిరియాలపొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో రుబ్బుకుని.. పక్కనబెట్టుకోవాలి. తర్వాత పుదీనా తరుగూ, తగినంత ఉప్పు, చిల్లీసాస్‌ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.

అలాగే బ్రెడ్‌స్లైసుల్ని పెనంపై ఉంచి.. వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక స్లైసుపై చీజ్‌ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్‌ మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేయాలి. వీటిని లేతగా వేడిపై రెండు నిమిషాలుంచి.. సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని.. మీకు నచ్చిన సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్ర పోలీసులు ఎఫ్‌బీఐ తరహాలో ఫోజ్ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ధ్వజం

ఆస్తి వివాదం - మాజీ సైనికుడు - కుమార్తెను హత్య చేసిన బంధువులు

చైనా అధ్యక్షుడికి బ్రెయిన్ స్ట్రోక్... ఆస్పత్రిలో అడ్మిట్?

Chandrababu Naidu: సేవా సంకల్ప అభియాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments