గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : బుధవారం, 19 జులై 2017 (23:00 IST)

మీ రాశి ఫలితాలు(20-07-2017)... ఇలా వున్నాయి...

మేషం : ఆర్థికంగా బాగా స్థిరపడతారు. హోటల్, తినుబండరాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు క

మేషం : ఆర్థికంగా బాగా స్థిరపడతారు. హోటల్, తినుబండరాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. బంధువుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. 
 
మిథునం : విద్యా సంస్థలలోని వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కుటుంబీకులతో చికాకులు ఎదుర్కొనక తప్పదు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
కర్కాటకం : వ్యాపారాభివృద్ధికై చేయుప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. కొత్తవ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు దూరంగా ఉండటం క్షేమదాయకం. కాంట్రాక్టుదారులకు ధన నష్టము సంభవించును. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
సింహం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు మీ చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. నిరుద్యోగులకు నిర్లిప్తధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. 
 
కన్య : చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దైవ, పుణ్య కార్యాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలెదురవుతాయి. ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
తుల : రచయితలకు, పత్రికా రంగంలోని వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు స్థానచలనయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృశ్చికం : ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
ధనస్సు : కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. పొదుపు  పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చరుకుగా పాల్గొంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
మకరం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. 
 
కుంభం : సృజనాత్మకంగా వ్యవహరించినపుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందని గ్రహించండి. ఏ విషయమైనా గోప్యంగా ఉంచండి. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. సోదరీ సోదరులు మీ యత్నాలకు చేయూతనిస్తారు. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. 
 
మీనం : స్త్రీలకు చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించండి. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. రవాణా రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం.