శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (15:10 IST)

కాలాష్టమి.. పచ్చిమిర్చి, ఆవనూనె దానం చేస్తే?

Kalabhairav Jayanti
Kalabhairav Jayanti
కాలాష్టమి రోజున శని లేదా రాహు కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తే మీకు శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు పెండింగ్ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ రోజున కాలభైరవ పూజ చేయడం ద్వారా భయాలను పోగొట్టుకోవచ్చు. 
 
కాలాష్టమి రోజున భైరవ దేవాలయంలో పచ్చిమిర్చి, ఆవనూనె, కొబ్బరి, శెనగలు దానం చేయాలి. కాలాష్టమి రోజున, భైరవుని చిత్రం లేదా విగ్రహం ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి, శ్రీకాల భైరవ అష్టకం పఠించాలి. 
 
కాలాష్టమి రోజున తీపి రొట్టెలను కాల భైరవుని వాహనంగా పేర్కొన్న నల్ల కుక్కకు తినిపించాలి. నల్ల కుక్క అందుబాటులో లేకుంటే ఏ కుక్కకైనా రోటీ తినిపిస్తే శని, కేతు దోషాలు తొలగిపోతాయి. 
 
కాలాష్టమి రోజు పొరపాటున కూడా కుక్కలను హింసించకండి. కాలాష్టమి రోజున కాల భైరవుడిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం ద్వారా భక్తుల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.