శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (21:00 IST)

అక్టోబరు నెల మాస ఫలితాలు... అమ్మవారిని ఎర్రగులాబీ, చామంతిలతో అర్చించినట్లైతే...

వ్యవహారం ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. హామీలివ్వవద్దు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. దంప

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం... అమ్మవారిని ఎర్రగులాబీ, చామంతిలతో అర్చించిన ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది.
వ్యవహారం ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. హామీలివ్వవద్దు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవదర్శనంలో ఒకింత చికాకులు తప్పవు. ప్రయాణం అనుకూలిస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మీ శ్రీమతి ప్రోత్సాహంతో యత్నాలు సాగిస్తారు. ఒక సంఘటన తీవ్ర ప్రభావం చూపుతుంది. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు అంచనాలను మించుతాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు సానుకూలతకు మరింతగా శ్రమించాలి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి సామాన్యం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం, ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. దైవదీక్షలు స్వీకరిస్తారు. అమ్మవారిని కలువపూలు, మందార పూలతో అర్చించిన ఆరోగ్యం, సంకల్పసిద్ధి చేకూరుతుంది. 
 
మిధునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
పొదుపు పథకాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటారు. ఖర్చులు విపరీతం. ముఖ్య వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించండి. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. యువకులకు అత్యుత్సాహం తగదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. జూదాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంద. అమ్మవారిని విరజాజులు, చామంతి పూలతో పూజించిన మీ కోరికలు సిద్ధిస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి యోగదాయకమే. గృహంలో సందడి నెలకొంటుంది. వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ ఉన్నతిని చూసి కొందరు అపోహపడే ఆస్కారం ఉంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అమ్మవారిని దేవగన్నేరు, జాజిపూలతో పూజించిన శుభం కలుగుతుంది.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. అమ్మవారిని ఎర్రమందారాలు, దేవగన్నేరు పూలతో అర్చించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్థం అనుకూలం. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. శుభకార్యాల్లో విలువైన కానుకలు చదివించుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలు అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పరిశ్రమల స్థాపనకు వనరులు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులు ఆటల పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రయాణంలో ఒకింత చికాకులు ఎదుర్కొంటారు. అమ్మవారిని సువర్ణగన్నేరు, పారిజాత పుష్పాలతో పూజించి, అర్చించిన మనోవాంఛలు నెరవేరుతాయి.
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆర్థికంగా కుదుటపడతారు. ఖర్చులు సంతృప్తికరం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తులకు ధన ప్రాప్తి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడతాయి. మీ ప్రమోయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దైవ దర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు. అమ్మవారిని తెల్ల కలువ, చామంతి పూలతో పూజించిన దినదినాభివృద్ధి పొందుతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్టం
రాబడికి మించి ఖర్చులుంటాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సహా పాటించండి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదాపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారిని ఎర్రమందారాలు లేక నందివర్ధనపూలతో పూజించిన ఆరోగ్యం, అభివృద్ధి చేకూరుతుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. శుభకార్య యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఉండదు. రుణ విముక్తులవుతారు. విలువైన వస్తువులు, పత్రాలు నగదు, జాగ్రత్త. ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషపరుస్తుంది. సంతనా భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంగా నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పదవులు, సభ్యత్వాలు దైవదీక్షలు స్వీకరిస్తారు. అమ్మవారిని దేవగన్నేరు, ఎర్రగులాబీ పూలతో అర్చించిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆత్మీయులతో, బంధువర్గంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణలకు అనూకూలం. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎవరికీ హామీలివ్వొద్దు. ప్రత్యర్థులతో  జాగ్రత్త. గిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రాజెక్టులు సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్వస్థలచలన ప్రాప్తి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. ప్రయాణం తలపెడతారు. అమ్మవారిని ఎర్రకలువ పూలతోగాని, గరుడవర్ధన పూలతో అర్చించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
కుంభం: ధనిష్టం 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఏ విషయాన్ని తెగే వరకూ లాగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు పర్యటనలు, పనిభారం విశ్రాంతి లోపం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషికి  త్వరలో ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో సంతృప్తినిస్తాయి. అమ్మవారిని చామంతి, మల్లెపూలతో అర్చించిన ఆర్థికావృద్ధి, గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితం. ఖర్చులు విపరీతం. రుణాలు చేబదుళ్లు స్వీకరిస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అవకాశాలు చేజారినట్టు చేజారిపోతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ ఆతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలు, నష్టాలను ధీటుగా ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. కళ, క్రీడా రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. అమ్మవారిని లిల్లీ పూలు, పారిజాతపూలతో అర్చించిన మానసిక ప్రశాంతత, మనోవాంఛలు నేరవేరుతాయి.