ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (23:42 IST)

శ్రీ నరసింహ స్వామిని బుధవారం.. ఈ శ్లోకంతో పూజిస్తే?

బుధవారం పూట నరసింహ స్వామిని పూజించడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈతిబాధలువుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. 
 
పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు. 
 
తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా ఈతిబాధలుండవు.
 
ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. 
 
ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.