బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Modified: బుధవారం, 29 మార్చి 2017 (16:03 IST)

ఉగాది పంచాంగం... కుటుంబీకుల వైఖరితో వృషభరాశి వారికి...

వృషభ రాశివారికి జూన్ వరకు అష్టమము నందు శని, ఆ తదుపరి వక్రగతిన శని సప్తమము నందు, అక్టోబర్ నుంచి శని తిరిగి అష్టమము నందు, ఆగస్టు వరకు రాహువు చతుర్థము నందు, కేతువు రాజ్యము నందు, ఆ తదుపరి అంతా తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి-1, 2, 3, 4 పాదములు, మృగశిర-1, 2 పాదములు
 
ఆదాయం-14 వ్యయం -11  పూజ్యత-6 అవమానం-1
 
వృషభ రాశివారికి జూన్ వరకు అష్టమము నందు శని, ఆ తదుపరి వక్రగతిన శని సప్తమము నందు, అక్టోబర్ నుంచి శని తిరిగి అష్టమము నందు, ఆగస్టు వరకు రాహువు చతుర్థము నందు, కేతువు రాజ్యము నందు, ఆ తదుపరి అంతా తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు పంచమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్టమము నందు సంచరిస్తాడు.
 
ఈ రాశి వారి గోచారం పరీక్షించగా ''అరక్షితం తిష్ఠతి దైవరక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి'' మీకు ఈ సంవత్సరం అంతా భగవంతుని కృపాకటాక్షాలు ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలు తలెత్తిన తెలివితో ఎదుర్కొంటారు. ఎదుటివారి ఆలోచనలు తేలికగా పసికడతారు. ఎత్తుకుపైఎత్తు వేసి చిత్తుచేస్తారు. ఒకోసారి మీ కుటుంబీకుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ రంగాల్లో వారికి ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు చర్మసంబంధించిన చికాకులు అధికం అయ్యే ఆస్కారం ఉంది. అప్పుడప్పుడు నరాలకు సంబంధించిన చికాకులు కూడా ఎదుర్కొంటారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. సాంఘిక, రాజకీయాల పట్ల ఆసక్తి అధికం అవుతుంది. 
 
ఇతరులు మీ ప్రభావానికి లోనవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడతారు. ప్రైవేట్ సంస్థల్లో వారికి సెప్టెంబర్‌లోపు మార్పులు అనుకూలించగలవు. మీ కుటుంబీకులు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వస్త్ర, ఫ్యాన్సీ, ఏజెన్సీ, మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు కలిసి  రాగలదు. నిర్మాణ రంగాల్లో పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారిని తక్కువ మాట్లాడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు స్ఫురించగలవు. మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడారంగాల్లో వారికి ఆశాజనకంగా ఉండగలదు. 
 
ఒక స్థిరాస్తిని అమ్ముతామనే ఆలోచనలు అధికం అవుతాయి. తాత్కాలికంగా విరమించడం మంచిది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు, ఆడిటర్లకు, చేతి వృత్తుల్లో వారికి కలసివచ్చేకాలం. పండ్ల, పూల, కొబ్బరి, వ్యాపారస్తులకు అభివృద్ధి ఉండగలదు. రుణం ఏ కొంతైనా తీరుస్తారు. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరిగిన తాత్కాలికంగా విరమించడం మంచిది. వివాహది శుభకార్యాల్లో కీలకపాత్ర వహిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
కంది, మినుము, నూనె, మిర్చి, జీడిపప్పు, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ధనం పుష్కలంగా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. అష్టమశనిదోషం ఉన్నందువల్ల, ఒకటికి రెండుసార్లు చేసే పనిని తరువుగా పరీక్షించడం మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తగలవు. జీవితానికి సంబంధించిన మంచి మంచి పథకాలు, నిర్ణయాలు తీసుకోండి. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు సైంటిస్టులకు, పండితులకు, జ్యోతిష్కులకు అభివృద్ధి కానవస్తుంది. 
 
 * ఈ సంవత్సరం అంతా కొంత అష్టమ శనిదోషం ఎదుర్కొన్నప్పటికిని నెమ్మదిగా సమసిపోగలవు. కృత్తికనక్షత్రం వారు 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, రోహిణి నక్షత్రం వారు 10 సార్లు నవగ్రహ ప్రదక్షిణలు, మృగశిర నక్షత్రం వారు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినట్లు శుభం కలుగుతుంది. 
 
 * ఈ రాశివారు ప్రతి మాసశివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించి, శ్రీమన్నారాయణుని ఆరాధించడం ద్వారా సర్వదోషాలు తొలగిపోతాయి. కృత్తికానక్షత్రం వారు స్టార్ రూబి, రోహిణి నక్షత్రం ముత్యం, మృగశిరనక్షత్రం వారు పగడం ధరించినట్లైతే  శుభం కలుగుతుంది. 
 
 * కృత్తికానక్షత్రం వారు అత్తి చెట్టును, రోహిణి నక్షత్రం వారు నేరేడు, మృగశిర నక్షత్రం మారేడు దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటిన మీకు అభివృద్ధి కానవస్తుంది.