శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 18 జులై 2016 (11:08 IST)

బల్లిని చంపారో ఇక అంతే.. పాపం చుట్టుకుంది.. ఎలాగో తెలుసుకోండి..?!

బల్లిని చూసి భయపడుతున్నారా? బల్లిని చూస్తే భయంతోనూ, జుగుప్సతోనూ చంపేస్తున్నారా? అయితే మీకు పాపం చుట్టుకున్నట్లే. బల్లి సర్పజాతికి చెందిందని దానిని చంపితే శాపానికి గురవకతప్పదని ఆధ్యాత్మిక నిపుణులు అంటు

బల్లిని చూసి భయపడుతున్నారా? బల్లిని చూస్తే భయంతోనూ, జుగుప్సతోనూ చంపేస్తున్నారా? అయితే మీకు పాపం చుట్టుకున్నట్లే. బల్లి సర్పజాతికి చెందిందని దానిని చంపితే శాపానికి గురవకతప్పదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దేవుళ్లలో ముక్కంటి మెడచుట్టూ, వినాయకుడి పొట్టచుట్టూ, మహావిష్ణువుకు నాగశయ్యగా సర్పం మారిన సంగతి తెలిసిందే. అలాంటి నాగజాతికి చెందిన బల్లిని చంపితే.. దాని శాపానికి గురయ్యే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
 
సర్పానికి, మనిషికి ఆదికాలం నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఇంకా సర్పజాతికి చెందిన బల్లిని చంపడం ద్వారా పాపం అనుభవించకతప్పదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మానవాళిని శపించగల శక్తి మహర్షులు, దేవుళ్లకు తర్వాత సర్పజాతికే ఉందని భావన. అందుకే సర్పజాతికి చెందిన బల్లిని చంపడం కూడదని వారు సూచిస్తున్నారు.