ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (14:10 IST)

ఫ్యాషన్ అంటూ కాలిమెట్టెలు ధరించట్లేదా? అరిగిపోయాక ఏం చేస్తున్నారు..?

వివాహమైన మహిళలు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించాలో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మహిళలకు మాంగల్యంతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చేవి కాలిమెట్టెలు. కాలికి రెండో వేలిలోనే వీటిని ధరిస్తారు. ఈ వేలుకు గర్భసంచికి నరాలక

వివాహమైన మహిళలు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించాలో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మహిళలకు మాంగల్యంతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చేవి కాలిమెట్టెలు. కాలికి రెండో వేలిలోనే వీటిని ధరిస్తారు. ఈ వేలుకు గర్భసంచికి నరాలకు లింకుంది. గర్భసంచికి సంబంధించిన నరాలు కాలి రెండో వేలి చివర్లలో ముగుస్తాయి. వెండి మెట్టెలను ఆ వేలికి ధరించడం ద్వారా ఆ నరాలకు మేలు జరుగుతుంది. 
 
నరాలను మెట్టెలు తాకడం ద్వారా గర్భసంచి బలపడుతుంది. ఇవి సంతానలేమికి కారణమయ్యే చెడు ప్రభావాల నుంచి కాపాడుతుంది. అందుకే వివాహ సందర్భంగా మహిళ కాలి వేటికి మెట్టెలు ధరిస్తారు. గర్భకోశ సంబంధించిన సమస్యలను నివారించాలంటే.. మెట్టెలను ధరించాల్సిందేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
 
ధరించిన మెట్టెలు అరిగిపోయాక.. వాటిని తీసిపారేయకుండా వాటిని షాపుల్లో ఇచ్చి వాటికి బదులు కొత్త మెట్టెలు తయారు చేయించుకోవాలి. ఫ్యాషన్ పేరిట వివాహమైన మహిళలు కాలిమెట్టెలను తొలగించకూడదు. ఇలా చేస్తే ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగానూ మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు.