1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. Masik Durgashtami-A Monthly Day to Worship Goddess Durga

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

Durga Devi
Durga Devi
సంస్కృత పరిభాషలో దుర్గ అంటే దుర్గములను నశింపచేసేది అంటే కష్టాలను తీర్చేది లేదా ఓటమి లేనిది అని అర్థం అలాగే అష్టమి అంటే ఎనిమిదవ రోజు. దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తే సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. 
 
దుర్గాష్టమి తిథి శక్తి స్వరూపమైన దుర్గాదేవికి అంకితమయ్యే రోజు. అయితే ప్రతి మాసం ఈ దుర్గాష్టమి శుక్లపక్ష అష్టమి తిధి అనగా అమావాస్య నుంచి ఎనిమిదవ రోజు నాడు వస్తుంది. దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. అలానే అస్త్ర పూజలు నిర్వహిస్తారు. 
 
అయితే ప్రతి మాసము వచ్చేటువంటి ఈ దుర్గాష్టమి రోజునాడు ఎవరైతే తాము చేసేటువంటి పనులలో ఆటంకం లేనటువంటి విజయాన్ని కోరుకుంటారో.. వారు తమ తమ ఆయుధాలకు గాని, తాము నిత్యము పని కోసం ఉపయోగించే వస్తువులకు గాని ఆరాధన చేయడం మంచిది. 
 
అదేవిధంగా ఈరోజు ఉపవాసం వుండటం సర్వదా శుభకరం. ఈ దుర్గాష్టమి వ్రతం సాయంత్రం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. కొన్ని ప్రాంతాలలో ఈ దుర్గాష్టమి రోజునాడు కుమారి పూజను కూడా ఆచరించడం ఆనవాయితీ. ఈరోజు దుర్గా శక్తి మాల మంత్రాన్ని దేవి ఖడ్గమాలను అలాగే దుర్గా చాలీసా చదవడం చాలా మంచిది.
 
ప్రతి మాసం వచ్చే అష్టమి తిథి రోజున అమ్మవారిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దుర్గాదేవి శక్తి, కరుణ, అనుగ్రహాలను గుర్తుచేసే ఒక మాసిక స్మరణ. ధైర్యం, స్వస్థత లేదా ఆధ్యాత్మిక బలం.. ఏది కావాలన్నా సరే, ఈ పవిత్రమైన రోజు దివ్య మాతృశక్తితో అనుసంధానమయ్యే ఒక సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు. 
 
 
 
ఈ రోజున, కొంత సమయం కేటాయించి ప్రశాంతంగా కూర్చుని, ప్రార్థించండి. ప్రేమతో తనను స్మరించే వారిని రక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి, ఆశీర్వదించడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు