స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్
సినిమాల్లో ముద్దులు పెట్టగా లేనిది బహిరంగంగా ఈ హీరోయిన్ కు ముద్దులు పెట్టలేనా ఏమిటి అంటూ ఓ హీరో స్టేజిపై చేసిన అసభ్య చేష్టలకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అతడు హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు మొత్తం వీడియోల ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూసినవారంతా అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహానికి కారకుడైన భోజ్‌పురి స్టార్ ఖేసారీ లాల్ యాదవ్ ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆయనకు భారీ అభిమానగణం ఉంది.
ప్రస్తుతం, ఆయన పాల్గొన్న ఒక స్టేజ్ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆయనను చూడటానికి, ఆయన మాటలు వినడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అయితే, ఇటీవల జరిగిన ఒక స్టేజ్ ప్రదర్శనలోని వీడియో ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రదర్శనలో ఖేసారీ హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించడంతో, సోషల్ మీడియాలో ఆయన తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అసలు ఖేసారీ లాల్ యాదవ్ స్టేజీపై ఏం చేశారో చూద్దాము.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఖేసారీ లాల్ యాదవ్ భోజ్‌పురి నటి రీతూ సింగ్‌తో కలిసి కనిపిస్తున్నారు. సదరు నటి వివాహిత అయినప్పటికీ, ఖేసారీ ఆమె విషయంలో అన్ని హద్దులను అతిక్రమించినట్లుగా వ్యవహరించారు. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న పలు వీడియోలలో, ఆయన రీతూతో చాలా సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. కొన్నిసార్లు ఆమెకు చాలా దగ్గరగా వంగి చూడటం, మరికొన్నిసార్లు తన షర్టు విప్పేసి ఆమెను కౌగిలించుకోవడం వంటివి చేశారు. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలోనే ఆయన ఆమెకు శారీరకంగా దగ్గరవ్వడానికి ప్రయత్నించారు.
ఒక క్లిప్‌లో ఖేసారీ లాల్ యాదవ్ రీతూకు ఎంత దగ్గరగా వచ్చారంటే, ఆయన ఆమెకు ముద్దు పెట్టబోతున్నారేమో అనిపించేంత పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా, స్టేజీపైనే ఆయన బహిరంగంగా ముద్దు అడిగారు. ప్రేక్షకులను ఉద్దేశించి ఖేసారీ మాట్లాడుతూ, మా సినిమాల్లో నేను ఆమెకు చాలాసార్లు ముద్దు పెట్టాను. మీరందరూ చూశారుగా.
సినిమాల్లో ముద్దు పెట్టగలిగినప్పుడు, బయట ఎందుకు పెట్టకూడదు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని నటి రీతూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె వెంటనే, అస్సలు కుదరదు అని సమాధానమిచ్చారు. దానికి ఖేసారీ, సరే, వద్దులే. ఎవరైనా ఇస్తే వారి దగ్గర ముద్దు తీసుకుంటాను అని అన్నారు. ఈ సందర్భంలోనే, ఖేసారీ లాల్ యాదవ్ తన శరీరాకృతిని ప్రదర్శిస్తూ, షర్టు లేకుండా స్టేజీపై కనిపించారు.
खेसारी ने पार कर दी सारी हदें! शादीशुदा हीरोइन ऋतु सिंह के साथ स्टेज शो में खेसारी लाल यादव ने जो कुछ किया, वो देखकर लोग शर्म से पानी-पानी हो गए! भरी पब्लिक में शर्टलेस होकर ऋतु को जबरन गले लगाया और सीने से चिपकाकर काफी देर तक बांहों में जकड़े रखा। खेसारी इतने करीब आए कि लग रहा था अब चुम्मा...1/2
— Sanjay Gupta ???????? (@sanjukgupta1987) November 19, 2026
మరో వైరల్ వీడియోలో ఖేసారీ లాల్ యాదవ్ నటి రీతూను తన దగ్గరకు లాక్కుని, చాలాసేపు పట్టుకుని ఉన్నారు. కార్యక్రమం జరుగుతుండగానే, ఆయన ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలామంది నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఒక నెటిజన్, భోజ్‌పురి పరిశ్రమకు చెడ్డ పేరు రావడానికి కారణం సరిగ్గా ఇదే అని వ్యాఖ్యానించారు. మరికొందరు... నువ్వెంత హీరో అయితే మటుకు తెరవెనుక షూటింగులో జరిగేవన్నీ బైట చేస్తానంటావా, అంత బలుపా అంటూ మండిపడుతున్నారు.

