1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Lizard falling effects on women & men

మీ కడుపుపై బల్లి పడిందా..? మహిళ తలపై బల్లి పడితే ఫలితం ఏమిటి?

బల్లి ఎక్కడైనా శరీరంపై పడితే ఇక జడుసుకుంటారు. ఏం జరుగుతుందో అని భయపడుకుంటారు. కానీ బల్లి శాస్త్రం ఏమంటుందంటే.. బల్లి శరీరంపై ఎక్కడ పడినా వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించుకున

Lizard falling effects on women & men
బల్లి ఎక్కడైనా శరీరంపై పడితే ఇక జడుసుకుంటారు. ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు. కానీ బల్లి శాస్త్రం ఏమంటుందంటే.. బల్లి శరీరంపై ఎక్కడ పడినా వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని నైవేద్యం సమర్పించుకోవాలి. ఇలా చేయడం ద్వారా దోషాలు నశిస్తాయి.

ఇకపోతే బల్లి నోటిపై పడితే అది అశుభమని, మహిళల కడుపుపై బల్లి పడితే అది శుభసూచకమని పండితులు అంటున్నారు. కడుపుపై బల్లి పడితే త్వరలో ఆ మహిళ గర్భవతి అవుతుంది. అలాగే అమ్మాయిల తలపై కానీ బల్లి పడితే కూడా శుభసూచకమని గమనించాలి. అలా తలపై బల్లి పడిన మహిళ సకలసంపదలను కలిగి ఐశ్వర్యాలను పొందుతుందని విశ్వాసం. ఇంకా ఎలాంటి ఈతిబాధలు లేకుండా.. మహారాణిలా జీవిస్తుందని బల్లిశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కానీ మహిళల చేతులు, కాళ్లపై మాత్రం బల్లి పడకూడదని అది అశుభానికి సంకేతమని గ్రహించాలన్నారు. మహిళల వీపుపై బల్లి పడితే చేదువార్త వస్తుందని, గోళ్లపై బల్లిపడితే జగడాలు తప్పవని వారు చెప్తున్నారు. 
 
అదే మగవారి తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బంధు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు అంటున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
తితిదే సేవల కోసం కొత్త యాప్‌: 30 నిమిషాల్లోనే 20వేలకు పైగా టిక్కెట్లు!