బుధవారం, 29 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : గురువారం, 28 జులై 2016 (15:34 IST)

తిరుమల శ్రీనివాసునికి ఇద్దరు రక్షక భటులు... ఎవరువారు.. ఎక్కడ ఉంటారు?

కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిరుమల గిరులలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యమైనదే. అలాగే తిరుమల ఆలయంలోని ప్రతి విగ్రహానికి ఎంతో చరిత్ర ఉంది.

కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిరుమల గిరులలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యమైనదే. అలాగే తిరుమల ఆలయంలోని ప్రతి విగ్రహానికి ఎంతో చరిత్ర ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లేటప్పుడు శ్రీవారికి ముందు ఇద్దరు రక్షకభటుల్లా కనిపిస్తారు. వారే జయ, విజయలు. జయ, విజయలంటే స్త్రీలు అనుకునేరు. కాదండోయ్‌.. వీరిద్దరూ పురుషులే. జయుడు.. విజయుడు. అసలు ఈ జయవిజయలు ఎవరు.. వీరెందుకు శ్రీవారి ముందు నిలబడి ఉంటారో తెలుసుకుందాం..
 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు వస్తూ, పోతూ ఉంటారు. వచ్చిన భక్తులు ధూళితో వస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే భక్తులు స్నానం చేయకుండానో.. లేకుంటే మహిళల్లో రకరకాల సమస్యలతో స్వామి దర్శనానికి వస్తుంటారు. దీన్నే ధూళి అంటారు. ఇలాంటి ధూళితో భక్తులు రాకుండా పుణ్యస్నానాలు ఆచరించి రావాలని జయ, విజయులు చెబుతుంటారు.
 
జయ, విజయలు స్వామి వారి ముందు ఉంటారు. జయుడు కుడిచేతి చూపుడు వేలుతో హెచ్చరిస్తుంటాడు, విజయుడు ఎడమచేతి చూపుడు వేలు చూపిస్తుంటాడు. అంటే భక్తులు శుద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తుంటారు. అంతేకాదు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని కూడా వీరు చేతివేళ్ళ ద్వారా చెబుతుంటారు. వీరినే ద్వారపాలకులు అంటారు. 
 
తిరుమహామణి మండపంలో బంగారువాకిలికి ఉభయ పార్స్వాలలో నిలిచి ఉండి శంఖ, చక్ర గదాధారులై, ద్వారపాలకులై జయ, విజయులు ఉన్నారు. పంచలోహ మూర్తుల ఎత్తు 10 అడుగుల పై మాటే. ఈ విగ్రహమూర్తుల చుట్టూ కర్రతో నిర్మింపబడి కటాంజనం ఏర్పాటు చెయ్యబడింది. బంగారు వాకిళ్ళతో పాటు, ఈ జయవిజయుల కటాంజనాలకు కూడా బంగారు పూత పూయబడిన రేకులు తాపపడి ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎక్కడా కానరాని స్థిర ప్రతిష్ట చేయబడిన ఇంత ఎతైన పంచలోహ సుందరమూర్తులు ఎప్పుడు ప్రతిష్టించబడ్డారో పురాణాలే చెప్పలేకున్నాయి. 
 
అహోరాత్రాలు శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిని ఏమరపాటు లేకుండా కపలా కాస్తున్నారు వీరద్దరు. గోవిందా..గోవిందా..!