రావణుడు చనిపోతూ లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు
'రామాయణం' ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు. కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణులలోని పండితులలో ఒకడైన రావణుడి దగ్గరికి వెళ్ళి నాలుగు మంచి విషయాలు
'రామాయణం' ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు. కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణులలోని పండితులలో ఒకడైన రావణుడి దగ్గరికి వెళ్ళి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడట. అన్నమాటలను ఎప్పుడు గౌరవించే లక్ష్మణుడు రావణుని దగ్గరికి వెళ్ళగానే రావణుడు ఇలా చెబుతాడట.
"మన రథ సారథితో, పాలవాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగా మెలగాలి. వాళ్ళతోగాని శతృత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా వెనుకాడరు. నీతో ఉంటూ నిన్న విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు".
ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశపరుడై ఉండకూడదు. దేవుడిని ప్రేమించవ్చు లేదా ద్వేషించవచ్చు కానీ ఏదైనా కూడా అపారమైన ధృఢ నిశ్చయంతో ఉండాలి.
ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలిసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది. ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి.
ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి. ఎంతో విలువైన మాటలు తన ప్రాణంపోతున్న రావణుడు ఆ సమయంలో చెబుతాడని అవి ఈ లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మణుడిని వెళ్ళి తెలుసుకోమంటాడట.