సంబంధిత వార్తలు
- Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)
- గంగానదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. దేవుడిలా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది (వీడియో)
- గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!
- గంగానదిలో రాత్రి 8:30 గంటల తర్వాత నో బోటింగ్
- మౌని అమావాస్య.. రావి చెట్టు కింద దీపం.. 108 ప్రదక్షిణలు
Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?
మౌని అమావాస్య జనవరి 29న వస్తుంది. గంగానదిలో స్నానమాచరించేందుకు మౌని అమావాస్య ఉత్తమమైనది. ఈ రోజున గంగానదీ స్నానమాచరించే వారికి సకల పాపాలు తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజున గంగానది అమృతంగా మారుతుందట. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్యను ఉత్తరాదిన మాఘి అమావాస్యగా పిలుస్తారు. మాఘ అమావాస్య రోజున గంగాస్నానం ఆచరించేవారికి పుణ్యఫలితాలుంటాయి.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. మౌని అమావాస్యను పురస్కరించుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాగ్, అలహాబాద్ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం యోగి సర్కారు అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మాఘమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా వుండే మౌనవ్రతాన్ని ఆచరించాలి. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా వుండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య పాప గ్రహాల శాంతి కోసం వస్తుంది.
పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ.. వారి ఆశీర్వాదాలను పొందవచ్చు. శనీశ్వరుని మౌని అమావాస్య రోజున పూజ చేయొచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
