మౌని అమావాస్య.. రావి చెట్టు కింద దీపం.. 108 ప్రదక్షిణలు
మౌని అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించాలి. ఈ రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే పితృ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
మౌని అమావాస్య రోజున "ఓం ఆద్య భూతయ్ విద్మహే సర్వ సేవాయ ధీమాహి, శివ శక్తి స్వరూప్ పితృ దేవ ప్రచోదయాత్" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
మౌని అమావాస్య రోజున పవిత్ర నదీ స్నానం చేసి సూర్య దేవుడికి నీరు సమర్పించాలి. రాగి చెంబులో నీరు, పువ్వులు, అక్షితలు, బెల్లం వేసి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.