1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2016 (16:20 IST)

ముక్కంటీ ఆలయంలో వెండి మూలనపడేశారు..!

శ్రీకాళహస్తి ఆలయంలో 15 టన్నులకుపైగా వెండి పోగుబడి ఉంది. ఇక్కడ నిర్వహించే రాహు-కేతు పూజల్లో వెండి నాగపడగలను వినియోగిస్తారు. రోజూ 2 వేలకుపైగా పూజలు జరుగుతుంటాయి. పూజలు చేయించుకునవారికి ఆలయమే నాగపడకలు అం

శ్రీకాళహస్తి ఆలయంలో 15 టన్నులకుపైగా వెండి పోగుబడి ఉంది. ఇక్కడ నిర్వహించే రాహు-కేతు పూజల్లో వెండి నాగపడగలను వినియోగిస్తారు. రోజూ 2 వేలకుపైగా పూజలు జరుగుతుంటాయి. పూజలు చేయించుకునవారికి ఆలయమే నాగపడకలు అందజేస్తుంది. ఎప్పటికప్పుడు వెండి కొనుగోలు చేసి పడగలు తయారు చేయించేవారు. ఈ విధంగా 15.27 టన్నుల వెండి పోగుబడింది. ఆ తర్వాత ప్రతిసారి వెండి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా 2.50 టన్నుల స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేసి దాన్నే రీసైకిల్‌ చేయడం ద్వారా నాగపడగలు తయారు చేస్తున్నారు. ఇది గత కొంతకాలంగా జరుగుతోంది. అయితే గతంలో కొనుగోలు నాగపడగల రూపంలో పోగైనా 15.27 టన్నుల వెండిన ఇటీవలే హైదరాబాద్‌లోని మింట్‌కు తరలించి కడ్డీలుగా రూపొందించారు. కరిగించిన వెండి ఇటీవలే ఆలయానికి చేరుకుంది.
 
వాస్తవంగా అప్పట్లో పలువురు కార్యనిర్వహణాధికారులు కమిషన్లకు కక్కుర్తుపడి నాణ్యత తక్కువగా ఉన్న వెండి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపైన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ఈఓల హయాంలో కొనుగోలు చేసిన వెండి పడగలను వేర్వేరుగా కరిగించారు. దీని వల్ల ఎవరు కొనుగోలు చేసిన వెండిలో ఎంత నాణ్యత ఉందో తెలుసుకోవాలన్నది ఆలోచన. ఈ తతంగాన్ని పక్కనబెడితే శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ 15 టన్నులకుపైగా వెండి ఉందన్నమాట. 
 
ఈ వెండిని బ్యాంకుల్లో జమ చేయాలని శ్రీకాళహస్తి దేవస్థానం ఆలోచిస్తోంది. దీని విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.60 కోట్లు దాకా ఉంటుంది. ఎంత నాణ్యత తగ్గిందనుకున్నా రూ.50 కోట్లకు తగ్గకపోవచ్చు. దీన్ని ఏ విధంగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలనేది అధికారులు ఆలోచించాలి. ఆలసమయ్యే కొద్దీ స్వామివారు నష్టపోక తప్పదు