తిరుమల మ్యూజియంలో వేల యేళ్ళ చరిత్ర కలిగిన తామ్రశాసనం
తిరుమలలో ప్రతి ప్రాంతమూ ప్రాముఖ్యమైనది. వైకుంఠంలో ఇప్పటికీ గుర్తించని ఎన్నో ముఖ్యమై ప్రాంతాలున్నాయని పురావస్తుశాఖ అధికారులే చెబుతుంటారు.
తిరుమలలో ప్రతి ప్రాంతమూ ప్రాముఖ్యమైనది. వైకుంఠంలో ఇప్పటికీ గుర్తించని ఎన్నో ముఖ్యమై ప్రాంతాలున్నాయని పురావస్తుశాఖ అధికారులే చెబుతుంటారు. అలాంటి ఒక పురాతనమైన తామ్రశాసనం ఒకటి తితిదేకి లభించింది. పురావస్తు శాఖ అధికారులు తామ్రశాసనాన్ని తితిదేకి అందించారు. ప్రస్తుతం ఆ తామ్రశాసనాన్ని తితిదే ఉన్నతాధికారులు మ్యూజియంలో ఉంచారు.
తిరుమల మ్యూజియం. శ్రీవారు తిరుమలలో సాక్షాత్కారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న పురాతన వస్తువులను దాచి ఉంచిన నిలయం. ఈ మ్యూజియంలో అతి పురాతనమైన తామ్రశాసనాన్ని భక్తుల కోసం తితిదే సందర్శనకు ఉంచింది. ఈ శాసనంలో గల అక్షర సమూహాలను అనువాదించడానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ తామ్రశాసనం ఎంతటి ప్రాముఖ్యమైనదో.
తామ్రశాసనం ఒకటే కాదు ఒక నమూనా కిరీటం కూడా ఇక్కడ ప్రదర్సనలో ఉంచారు. ఈ కిరీటం స్వర్ణ కిరీటం తయారీకి నమూనాగా వాడినట్లు కనిపిస్తుంది. ఒక భవనం కట్టాలంటే ఒక చిన్న నమూనా చసుకొన్నట్లు ఒక గొప్ప అబ్రాణం చేయటానికి ముందుగా రాగి లోహంతో తయారు చేయబడిన నమూనా కిరీటం ఇది. మొట్టమొదటిసారిగా తిరుమల మ్యూజియంలో వైకుంఠ ఏకాదశి నుంచి భక్తుల చూపరుల ప్రదర్శనగా శాశ్వత ప్రాతిపదికన ఉంచారు. ఇది కూడా ఎంతో పురాతనమైనది.
అలాగే 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల స్వామివారిని దర్శించారు. వచ్చిన ప్రతిసారి ఎంతో విలువైన ఆభరణాలను వజ్రకిరీటంతో సహా సమర్పించినట్లు దేవాలయంలో గత శాసనాల ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయులతో పాటు తని ఇరువురు రాణులు పురోహితులైన రంగదీక్షితులు, శివదీక్షితులు, నిత్య సేవకులైన మల్లరసు, శాసన లేకుండా శ్రీపతి వెంక ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. అతడు సమర్పించిన ప్రభావళి కిరీటం, కత్తి మొదలైన ఆలయంలో ఉండగా ఒక అపురూపమైన దూపగంట శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది. ఈ దూపగంటలపై శ్రీ క్రిష్ణదేవరాయలు స్వయానా దూప గంటలను తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్న దేశాయ బొల్లిద్తు అందజేసినట్లు లిఖించిబడి ఉన్నది. క్రీ.శ.1524లో ధూపగంట ఆలయానికి చేరింది.
ఇలా ఎన్నో ముఖ్యమైన పురాతనమైన వస్తువులు మ్యూజియంలో ఉన్నాయి. తిరుమలకు వస్తున్న భక్తులు ఇప్పటికీ మ్యూజియంకు వచ్చి పురాతన వస్తువులను తిలకిస్తున్నారు. మీరు కూడా తిరుమలకు వస్తే పురాతన వస్తువులను తిలకిస్తున్నారు కదూ.. గోవిందా... గోవిందా....