మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 నవంబరు 2014 (17:34 IST)

విజయం లభించాలంటే.. చిన్నాపురం వెంకన్నను స్మరించండి.!

కోరుకున్న కోరికలు నెరవేరాలా? అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవ్వాలంటే.. చిన్నాపురం వెంకన్న స్వామిని ప్రార్థించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.
 
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం చూడగానే మనసు పవిత్రమై భక్తి భావాలతో వికసిస్తుంది.
 
ఎంతో చరిత్రను కలిగి ఉన్న ఈ ఆలయం పునరుద్ధరించబడింది. గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉండగా, ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో రాజ్యలక్ష్మీదేవి ... గోదాదేవి దర్శనమిస్తుంటారు. 
 
ప్రతి శుక్ర - శని వారాల్లో ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక వార్షిక ఉత్సవాలు, ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు.. సేవలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యాన్ని ఆరంభించినా అది విజయవంతమవుతుందని భక్తుల విశ్వాసం.