1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. 2016 challenging year for politicians and people

ఈ ఏడాది దేశానికి, రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు తప్పవ్.. భూకంపాలు..?

2016
2016వ సంవత్సరంలో దేశానికి, రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు తప్పవని.. భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా సందర్శించుకున్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిజీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, నాయకులు 2016లో చాలా విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే షిరిడీ సాయినాథునికి విరాళాలు వెల్లువల్లా వస్తున్నాయి. నూతన సంవత్సర సందర్భంగా షిరిడీ ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షిరిడీలోని సాయినాథుని ఆలయానికి గత నెల 24 నుంచి 27వ తేదీ వరకు భారీ ఎత్తున విరాళాలు అందాయని అకౌంట్స్ అధికారి డాక్టర్ జిర్ పే తెలిపారు. ఆ రోజుల్లో నగదు రూపంలో 3.53 కోట్ల రూపాయలతో పాటు 3481 గ్రాముల బంగారం, పది కేజీల వెండిని భక్తులు సాయినాధునికి సమర్పించినట్టు జిర్ పే వెల్లడించారు.
About Writer
Selvi