మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 మే 2016 (13:49 IST)

శ్రీరామ భక్తులకు ఓ శుభవార్త.. నవంబర్ 9న అయోధ్యలో నిర్మాణానికి ముహూర్తం!?

శ్రీరామ భక్తులకు ఓ శుభవార్త. అయోధ్యలో రామాలయం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 9వ తేదీన రాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పూజారుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా రామాలయాన్ని అయోధ్యలో నిర్మించనున్నట్లు.. త్వరలో ఆ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
 
ఇక అయోధ్యలో రామాలయం ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టు న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని స్వామి వెల్లడించారు. అయోధ్య నిర్మాణంపై సుప్రీం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆశించారు. అయోధ్యలో రామాలయ ఏర్పాటుపై సింహష్ట కుంభమేళాలో పాల్గొన్న సాధువులు, అర్చకులు, మత పెద్దలు చర్చించినట్లు సమాచారం.