శనివారం, 16 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:34 IST)

తిరుమల కొండపై ఉచితంగా అన్న, జల ప్రసాదాలు.. టీ, టిఫిన్, కాఫీ, పాలు కూడా ఫ్రీ..?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటిదాకా అన్నప్రసాద సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో కాకుండా ఇత

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటిదాకా అన్నప్రసాద సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా భోజన సౌకర్యం కల్పిస్తూ వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భక్తులు ఆహారం కోసం హోటళ్ల వైపు చూడకుండా.. కదిలే అన్న ప్రసాద వితరణ కేంద్రాలను తితిదే ఏర్పాటు చేసింది.
 
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 1984లో అన్న ప్రసాద వితరణను తితిదే ప్రారంభించింది. ఆపై కాలక్రమేణా ఈ పథకంలో ఎన్నో మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా వేలాది మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం కొండపైకి వచ్చే వారందరికీ అన్నపానీయాలు అందించేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ తిరుమల కొండపై వచ్చే యాత్రికులందరికీ అన్ని వసతులు ఉచితంగా కల్పించాలనే ఆలోచనతో ఈవో సాంబశివరావు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. 
 
భక్తులకు ఉచితంగా త్రాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ, పిల్లలకు పాలు ఉచితంగా అందజేయాలని సంకల్పించారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువస్తున్నారు. తొలుత శుద్దమైన త్రాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో జలప్రసాదం పేరిట త్రాగునీటి కేంద్రాలను ప్రారంబించారు. అలిపిరి తనిఖీ కేంద్రం మొదలుకుని కొండపైగల అన్ని ప్రదాన ప్రాంతాలలో 15 శుద్దినీటి యంత్రాలను ఏర్పాటు చేశారు.