కార్తీక పౌర్ణమి... సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభ
కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో ఉదయానే భక్తుల రద్దీ బాగా పెరిగింది.
తెలతెలవారుతుండగానే, సముద్రునికి పౌర్ణమి జ్యోతి వెలిగించి హారతి ఇచ్చి పౌర్ణమి స్నానాలు ప్రారంభించారు. పవిత్ర సాన్నానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు చేరుకున్నారు. కార్తీక పూర్ణిమ పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది మంగినపూడి సముద్ర తీరం. తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్న భక్తులు సాయంత్రం అమృత పాశుపత హోమం, కార్తీక దీపారాధన, సాగర హారతి, టపాసుల మోత మోగిస్తున్నారు